చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు

చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు

చౌట్కూర్: విద్యార్థులు చిన్నతనం నుంచే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీఆర్టీయూ ) మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం  వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ‘పరిశుభ్రత – ఆరోగ్యకరమైన అలవాట్లు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వ్యవసాయ విద్యపై ఆసక్తి పెంచుకోవాలి:ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే వ్యవసాయ రంగం, దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి, వ్యవసాయ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని, దేశ సేవలో భాగస్వాములు కావాలని కోరారు.స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలి: అవగాహన సదస్సులో వ్యవసాయ కళాశాల విద్యార్థినులు రితిక, శ్రీనిధి, రాణి, దివ్యశ్రీలు మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పరిశుభ్రత పాటించాలని, ఉదయం వేళల్లో చదువుకునే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. సమయాన్ని వృథా చేసే టీవీలు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ చూపాలని కోరారు.పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం వేయకుండా పరిసరాలను స్వచ్ఛంగా ఉంచడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు. పరిశుభ్రత, క్రమశిక్షణ, మంచి అలవాట్లను అలవరచుకుంటే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ విద్యలో రాణిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రమాదేవి, లలితదేవి, కవిత, భాస్కర్‌రాజు, సూర్యారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు