సింగూర్ డ్యామ్‌లో 4.175 టీఎంసీల నీటి నిల్వ

ఇన్‌ఫ్లో కంటే అవుట్‌ఫ్లో తక్కువగా ఉండడంతో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం

సింగూర్ డ్యామ్‌లో 4.175 టీఎంసీల నీటి నిల్వ

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం క్రమంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి డ్యామ్‌లో 4.175 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 515.170 మీటర్లుగా నమోదైంది. కాగా, ఈ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు.గత 24 గంటల్లోడ్యామ్‌లోకి సగటున 461 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, వివిధ అవసరాల నిమిత్తం 380 క్యూసెక్కుల నీటిని అవుట్‌ఫ్లోగా దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అవుట్‌ఫ్లో కంటే ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో నీటి నిల్వ స్థిరంగా ఉంటూ నీటిమట్టం స్వల్పంగా మెరుగుపడిందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.
Views: 378

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు