వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన

వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన

చౌట్కూర్, : చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో బుధవారం వరి సాగులో వేరు ముంచే  పద్ధతిపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామానికి చెందిన రైతు మహేశ్ యాదవ్ పొలంలో వరి నారు మొక్కల వేర్లను జీవ ఎరువులు, జీవ నియంత్రణ కారకాలు, పోషకాలు కలిపిన ద్రవ మిశ్రమంలో 15 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టి నాటే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.ఈ పద్ధతిని అనుసరించడం వల్ల వరి నారు మొక్కలు ప్రారంభ దశలోనే బలంగా ఎదుగుతాయని, వేర్ల వ్యవస్థ మెరుగుపడి తెగుళ్లు, వ్యాధుల బారిన పడే అవకాశం గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ విద్యార్థినులు వివరించారు. దీనివల్ల పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇందు, రూత్ ప్రమీల, నైవల్య, అద్రిక, కృపాలి, హమ్షీక పాల్గొని వేరు ముంచే పద్ధతి ప్రాముఖ్యత, జీవ ఉద్దీపన ద్రావణం వినియోగం, సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామానికి చెందిన రైతులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
Views: 569

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు