ఆచార్య జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిగా పనిచేయాలి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

ఆచార్య జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిగా పనిచేయాలి

జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కమిషనర్

హన్మకొండ : తెలంగాణ సిద్ధాంతకర్త, మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి సందర్భంగా బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలు, ఆయన ఆశయాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్ బాబు, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, అకౌంట్స్ అధికారి శివ లింగం, సూపరింటెండెంట్ బాకం సంతోష్, అన్ని విభాగాల సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు