రేగోడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమయపాలన పాటించని ఉపాధ్యాలు
విద్యాధికారుల స్పందన కరువు
రేగోడ్ (మెదక్) : రేగోడు మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సమయపాలనకు పాఠశాలకు రావడం లేదు.సంగారెడ్డి నుండి పాఠశాల సమయంలో రెండు బస్సులు ఉన్నప్పటికీ బస్సులు లేవని చెప్పుతూ సమయపాలన పాటించడం లేదు.గురువారం ప్రార్థన చేస్తున్న సమయంలో ముగ్గురే టీచర్లు ఉండడం విశేషం.ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు 13 మంది ఉండగా వారు ప్రార్థన సమయంలో లేరు కదా అని ప్రిన్సిపాల్ స్వయంప్రభకు వివరణ కోరగా వారు బస్సుకు వస్తారు, వారికీ సమయపాలన లేదు అని చెప్పారు.ఈ విషయంపై సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


