పంటల "డిజిటల్ సర్వే" పై అవగాహన కార్యక్రమం....
పంటల "డిజిటల్ సర్వే" పై అవగాహన కల్పించిన మండల వ్యవసాయ అధికారి భాస్కర్...
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ పంట సర్వే పై మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి సర్వేయర్స్ దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ( వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) గుండ్లపల్లి రైతు వేదిక లో వీక్షించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ... రైతు సోదరులు ఈ వానాకాలం సీజన్ లో సాగు చేస్తున్న పంటలను డిజిటల్ క్రాప్ సర్వే చేయించుకోవాలన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి క్షేత్ర స్థాయి సర్వేయర్ ఉంటారన్నారు.సర్వేయర్ మీ గ్రామానికి వచ్చినపుడు ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ సర్వే నెంబర్ లో ఉన్న పంట వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.క్షేత్ర స్థాయి లో సర్వేయర్, సర్వే నంబర్ సబ్ డివిజన్ పరిధి లో 20 మీటర్ల దగ్గరకి వెళ్ళినపుడు మాత్రమే ఆ పంట వివరాలు ఆన్లైన్ లో డిజిటల్ గా నమోదు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.ఈ సంవత్సరం ప్రతి సబ్ డివిజన్ సర్వే నంబర్ లో ఉన్న ప్రతి పంట సర్వే చేయడం జరుగుతుందన్నారు.రైతు సోదరులు వారికి సంబంధించిన ప్రతి సబ్ డివిజన్ సర్వే నంబర్ లో పంట వివరాలు సర్వేయర్ దగ్గర నమోదు చేసుకోవాలని సూచించారు.డిజిటల్ పంట సర్వే లో నమోదు కాని రైతుల కు పంట కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులు ఉంటాయని తెలిపారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 18:57:08
వెల్దుర్తి మెదక్ : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ మానేపల్లి గ్రామానికి చెందిన కమ్మరి మౌనిక ను మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని మెదక్...
