నాగరకుంట గ్రామ పంచాయతీలో "హర్ ఘర్ జల్" కార్యక్రమం
షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండలంలోని నాగర కుంట గ్రామ పంచాయతీ "హర్ ఘర్ జల్" గ్రామంగా నిలిచింది. జల్ జీవన్ మిషన్ పథకం కింద గ్రామంలోని అన్ని గృహాలకు 100% కుళాయి కనెక్షన్లు పూర్తి చేసి,ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటి సరఫరా ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... "గతంలో బిందెలు మోసిన మహిళల కష్టాలు తీరాయి. ఇప్పుడు ఇంటింటికీ నల్లా నీరు అందిస్తామని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ హారిక 'హర్ ఘర్ జల్' సర్టిఫికెట్ ను సర్పంచ్ పాలమాకుల మల్లయ్య కి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుగ్గ రాములు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి,జీపీ సిబ్బంది గ్రామ ప్రజలు,ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ మానస,సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


