పశువాదశాల టెండరును వెంటనే వేయాలి 

బిజెపి టిఆర్ఎస్ నాయకుల డిమాండ్ 

పశువాదశాల టెండరును వెంటనే వేయాలి 

సిద్దిపేట, {హుస్నాబాద్}:  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో పశువాద శాల టెండర్ వేయకపోవడం వల్ల చనిపోయిన పశువులు పశువులను కోస్తూ ప్రజలను అనారోగ్యాలకు గురి చేయడం జరుగుతుంది అలాగే పశువుల టెండరు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుండి పెట్టకపోవడం వల్ల మున్సిపల్ ఆదాయాన్ని కూడా పూర్తిస్థాయిలో గండిపడడం జరుగుతుంది గతంలో కమిషనర్ కు పశువాద చాలా టెండర్ గురించి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు టెండర్ లేకపోవడంలో అంతర్యమేందో కమిషనర్ గారు సమాధానం చెప్పాలి అలాగే అపరిశుభ్రంగా ఉన్నటువంటి మాంసం దుకాణాలపై పర్మిషన్ లేకుండా ఇస్తానుసారంగా కోస్తూ బహిరంగంగా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకుండా దుమ్ము ధూళితో అమ్ముతున్న మున్సిపల్ కమిషనర్ మరియు సానిటరీఇన్స్పెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదు.ముఖ్యంగా గోర్లు మేకలు మరియు ఆవులు పశువులు పశువులను ఎలాంటి వెటర్నరీ డాక్టర్ పర్మిషన్ లేకుండా వారు పరీక్షలు చేయకుండా రోగాలు మరియు చనిపోయినటువంటి వాటిని పశువాదశాల యజమానులు కోస్తున్న మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు సమాధానం చెప్పాలి అలాగే పశువాదశాల టెండర్ వేయకపోవడం వల్ల మున్సిపల్ ఆదాయానికి దాదాపు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు సంవత్సరానికి గండిపడడం జరుగుతుంది. ఇది ఎవరి మెయిల్ గురించి చేస్తున్నారో కమిషనర్  చెప్పాలి.నిత్యం వందలాది పశువులు మరియు మేకలు గొర్లు పశు డాక్టర్ పర్మిషన్ లేకుండా  రోగాలు వచ్చినటువంటి వధిస్తూ బహిరంగ మార్కెట్లో అమ్మడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతూ అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుంది గతంలో పత్రికలు ఎన్నోసార్లు కూడా హుస్నాబాద్ లో జరుగుతున్న అన్యాయంపై కూడా పత్రికల్లో వచ్చిన మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులకు మరియు కమిషనర్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పక్షవాదశాల టెండర్లు వేయాలని హుస్నాబాద్ డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర దళిత సంఘాల జేఏసీ అధ్యక్షుడు బత్తుల చంద్రమౌళి బిజెపి దళిత మోర్చా జిల్లా నాయకులు భువనగిరి రవి టిఆర్ఎస్ నాయకులు గడప కొమురయ్య నాయకులు డిమాండ్ చేశారు.
Views: 29

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News