ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శంకర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను అధికారులు స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలపరుస్తూ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ పోషించిన పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన కలలుగన్న ఆశయాలను సాకారం చేసే దిశగా అందరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఆయన ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పి. సువర్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్‌తో పాటు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


