కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ బుధవారం అర్ధరాత్రి సమయంలో సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామ శివారులో ఉన్న చెరువు కట్టకు భారీగా భుంగ పడటంతో చెరువు కట్ట తెగిపోయి , చెరువులోని నీరు పూర్తిగా బయటకు వెళ్లిపో యింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., సంఘటన స్థలాన్ని సందర్శించి చెరువు కట్ట పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువు కట్ట తెగిపోవడానికి గల కారణాలు , నీటి ప్రవాహం దిశ , జరిగిన నష్టం , సమీప గ్రామాలపై ప్రభావం , ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలు సంచరించకుండా తగిన హెచ్చరికలు జారీ చేయాలని , అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు పికెట్లను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చెరువులు , వాగులు , కాలువలు , వరద ప్రవాహాలు ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లరాదని , పిల్లలను నీటి వనరుల వద్దకు పంపవద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డయల్ 112 కు సంబంధిత సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్బంగా ధర్పల్లి సి.ఐ బిక్షపతి , సిరికొండ ఎస్.ఐ జె. రామకృష్ణ , ధర్పల్లి ఎస్.ఐ జి. సందీప్ , గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
