మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి..

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి

 హన్మకొండ :తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్‌ఎస్‌ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి  గుర్తు చేసుకున్నారు. ఇంత చిన్న వయసులోనే తమ్ముడు లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి  పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. పెద్ది లేని లోటు పుడ్చలేనిదని ఇలాంటి కష్టసమయంలోనే మనోధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News