కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో BRSలో ఉద్యమకారుల చేరిక
- BRS మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాలేపు శీను ఆధ్వర్యంలో కార్యక్రమం
- మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు ఆధ్వర్యంలో పలువురు ఉద్యమకారులు పార్టీలో చేరిక
ములుగు/మల్లంపల్లి: ములుగులోని BRS పార్టీ కార్యాలయంలో BRS మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాలేపు శీను ఆధ్వర్యంలో, కాకులమర్రి లక్ష్మణ్ బాబు సమక్షంలో మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు ఆధ్వర్యంలోని పలువురు ఉద్యమకారులు BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మల్లంపల్లి మండల సాధన కోసం గతంలో ప్రజలతో కలిసి ఉద్యమించిన ఉద్యమకారులు, మండలం ఏర్పడిన అనంతరం మల్లంపల్లి అభివృద్ధి కోసం మరోసారి రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మండల సాధన ఉద్యమం నుంచి అభివృద్ధి పోరాటం
మల్లంపల్లి మండల సాధన కోసం సంవత్సరాల తరబడి ప్రజలతో కలిసి పోరాటం చేసిన మండల సాధన సమితి అధ్యక్షులు గోల్కొండ రాజు మాట్లాడుతూ.. మండలం సాధించడం తమ ఉద్యమ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన ఘట్టమని, అయితే మండలం ఏర్పడినంత మాత్రాన ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని అన్నారు.మల్లంపల్లికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, 108 అంబులెన్స్, పోలీస్ స్టేషన్, బస్‌స్టాండ్, గ్రంథాలయం, విద్యా సదుపాయాలు, రహదారులు తదితర మౌలిక వసతుల కోసం ప్రజల తరఫున నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
డబ్బు పంపిణీ లేకుండా సుమారు 600 ఓట్లు
స్థానిక ఎన్నికల్లో ఎలాంటి డబ్బు పంపిణీ, ప్రలోభాలకు పాల్పడకుండా ప్రజల మధ్యకు వెళ్లి సుమారు 600 ఓట్లు సాధించామని తెలిపారు. ఆ ఓట్లు తమపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ప్రతీకగా భావిస్తున్నామని పేర్కొన్నారు.డబ్బుతో వచ్చిన ఓటు ఒకరోజు ఉంటుంది.. నమ్మకంతో వచ్చిన ఓటు తరతరాలు ఉంటుంది” అని అన్నారు.
మేరుగు రాజుకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేరుగు రాజుకు తెలంగాణ ఉద్యమం, విద్యార్థి ఉద్యమం, ప్రజాసంఘాల నేపథ్యం ఉంది. గతంలో ఇండియన్ లెజెండ్స్ యూత్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ విప్లవ ఉద్యమ సహచరుడిగా పనిచేశారు. అలాగే ఆదివాసీ హక్కులు, బడుగు బలహీన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం జరిగిన వివిధ ప్రజా ఉద్యమాల్లో భాగస్వామిగా పనిచేసిన అనుభవం తనకు ఉందని మేరుగు రాజు తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయ వేదిక ద్వారా కూడా తన వంతు కృషి చేస్తానని అన్నారు. మల్లంపల్లి అభివృద్ధిపై మరో పోరాటం మండలం సాధించడం ఒక లక్ష్యం.. మండలం అభివృద్ధి చెందేలా చేయడం మరో లక్ష్యం” అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఉద్యమకారులు తెలిపారు. మల్లంపల్లి మండలానికి అవసరమైన మౌలిక వసతుల సాధన కోసం ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. మండలం కోసం పోరాడాం.. అభివృద్ధి కోసం మరోసారి పోరాడతాం.. మల్లంపల్లి కోసం మా ప్రయాణం కొనసాగుతుంది” అని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారుఈ కార్యక్రమంలో ఒన్నాల మహేష్, బత్తిని అజయ్, ముడెడ్ల నవీన్, గోల్కొండ మహేందర్, పల్లెబోయిన అరవింద్, రుత్విక్, ఎం.డి. అఫ్సర్, కూరాకుల వంశీ, కార్తిక్, గుండ కర్ణాకర్, గాజు అజయ్, ఎస్.కె. పాషా పాల్గొన్నారు.వీరితో పాటు శ్రీనగర్ సర్పంచ్ ఆకుల మల్లేష్, మాజీ ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, మొర్రి రాజుయాదవ్, నారోజు హరినాథ్, శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ జాని, మహమ్మద్ చోటు, మహమ్మద్ పాషా, బక్కి శ్రీను, నాయకుల ప్రభాకర్, తూర్పాటి మధు, సుధాకర్ రెడ్డి, రాయల్ రవి, సతీష్, సంపత్, గోవింద నాయక్, గోపాలరెడ్డి, వినయ్ కుమార్, ఏటూరునాగారం సర్పంచ్ శ్రీలత, జంగాలపల్లి సర్పంచ్ మోహన్, భూక్యా మురళి, బుల్లెట్ ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


