ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి

భారతరత్న ప్రకటించాలి: వలస సుభాష్ చంద్రబోస్

అక్కన్నపేట,   ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలకంగా పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు, బీసీ దళపతి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సంఘ సేవకులు వలస సుభాష్ చంద్రబోస్ ఆయనకు ఘన నివాళులర్పించారు. 1915లో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాన్ని ప్రజా సేవకు, సామాజిక న్యాయానికి, తెలంగాణ సాధనకు అంకితం చేశారని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. కుల, వర్గ, ప్రాంతీయ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 1940 దశకంలో తెలంగాణలోని జాగీర్దార్లు, సంస్థానాధీశులు, వతన్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, ముక్తేదార్లు, ఇనాందార్ల నిరంకుశత్వం, వెట్టిచాకిరీ, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ వృత్తి పనివారిని సంఘటితం చేయడంలో బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు.తెలంగాణ సాధన తన చిరకాల వాంఛగా భావించిన బాపూజీ తొలి, మలిదశ ఉద్యమాల్లో వీరోచితంగా పోరాడారని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకుని తెలంగాణ కోసం నిలిచిన త్యాగశీలి అని కొనియాడారు.

చేనేత కార్మికుల సంక్షేమానికి విశేష కృషి

చేనేత కార్మికుల సంక్షేమం కోసం 1950లో సహకార ఉద్యమానికి శ్రీకారం చుట్టి, అనేక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేశారని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. చేనేత వృత్తిదారుల కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు.

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర పోరాటం

సామాజికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో బీసీ రిజర్వేషన్ల అమలుకు, మండల్ కమిషన్ సిఫారసులకు ఆయన మద్దతుగా నిలిచారని తెలిపారు. అందుకే బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆరాధ్యుడిగా నిలిచారని అన్నారు.

భారతరత్న ప్రకటించాలి

తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించాలని వలస సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 27న ఆయన జయంతి సందర్భంగా ఈ గౌరవాన్ని ప్రకటించాలని కోరారు. బాపూజీ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ, ఆయన 14వ వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు అర్పించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం