1008 నేమినాథ్ దిగంబర్ మందిరములో కలెక్టర్ పూజలు
మందిరములో ప్రత్యేక పూజల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి డెస్క్ : జోగిపేట పట్టణంలోని అతి ప్రాచీనమైన 1008 నేమినాథ్ దిగంబర్ జైన మందిరములో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మందిర పూజారులు,మందిర కమిటీ సభ్యులు కలెక్టర్ ను సాదరంగా స్వాగతం పలికారు సోమవారం జరిగిన అభిషేక కార్యక్రమములో పాల్గొన్నారు మందిరం చుట్టూ తిరిగి ఆలయ విశేషాలు తెలుసుకున్నారు వరుసగా రెండు రోజులు కలెక్టర్ జైన మందిరంలో పూజలో పాల్గొనడం ఎంతో సంతోషముగా వున్నది అని ఆలయ కమిటీ సభ్యులు వ్యక్తం చేశారు ఈ పూజా కార్యక్రమములో మందిర పూజారి సత్యనారాయణ జైన్,మందిర కమిటీ సభ్యులు సంతోష్ జైన్,సంపత్ జైన్, వర్ధమాన్ జైన్, మనోహర్ ప్రసాద్ జైన్ మరియు భక్తులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


