బాల్కొండ వాసికి 'రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ' పురస్కారం
బాల్కొండ (నిజామాబాదు జిల్లా) : నిజామాబాదు జిల్లా బాల్కొండ నియోజక వర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.వీ. సుబ్బారెడ్డి 'రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ' అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు ని హైదరాబాద్ లోని బిర్లా ప్లానెటోరియం బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిం చిన రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి.సుబ్బారెడ్డి సార్ విద్యాబోధనలో 36 సంవత్సరాల విశేష అనుభవం, విద్యార్థుల సమగ్ర వికాసానికి ఆయన అందిస్తున్న నిరంతర సేవలను గుర్తిస్తూ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక (మెమెంటో), ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు, వివిధ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అవార్డు సాధించిన సుబ్బారెడ్డిని శ్రీ వెంకటేశ్వర పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు బాల్కొండ గ్రామ ప్రముఖులు అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


