ముచ్చర్లలో ఏ బి కేబుల్ సమస్య
పాత కేబుల్ తొలగించి కొత్త కేబుల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తుల డిమాండ్
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో పాతబడిన ఏబి కేబుల్ కారణంగా విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. కేబుల్ పాడైపోవడంతో విద్యుత్ హెచ్చుతగ్గులు, సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ అంతరాయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యను విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి, పాత కేబుల్‌ను తొలగించి కొత్త కేబుల్‌ను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యుత్ సరఫరా సజావుగా ఉండేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


