విద్యారంగంలో పెద్దపల్లి జిల్లా టాప్.....

విద్యారంగంలో పెద్దపల్లి జిల్లా టాప్.....

  • 65 కోట్ల రూపాయల తో ప్రభుత్వ బడుల ఆధునీకరణ..
  • కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంపు..
  • కాంగ్రెస్ హయంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం..
  • రాష్ట్ర ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కు మండల విద్యాధికారి రమేష్,ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శిరీష,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.హరేరామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అల్పాహారాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి కళాశాల అధ్యాపకులతో చర్చించి కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీ అల్పాహారం వర్తిస్తుందన్నారు.గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని,ప్రజా ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో 65 కోట్ల రూపాయల తో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ,నూతన తరగతి గదులు,మరుగుదొడ్లు,తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు.200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.  మిగిలి ఉన్న పనులను సంవత్సర కాలంలో పూర్తి చేస్తామన్నారు.విద్యారంగంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణం అన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామానికి,మండలానికి,జిల్లాకు, రాష్ట్రానికి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రమేష్,స్థానిక సర్పంచ్ సతీష్, ఉపాధ్యాయులు, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి,డైరెక్టర్లు,పలు గ్రామాల సర్పంచులు,ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం