పట్టు పురుగుల పెంపకం ద్వారా రైతులకు రాయితీలు
పట్టు పరిశ్రమ శాఖ ఏఎస్ఓ బండారు లింగం
సంగారెడ్డి డెస్ : పట్టు పురుగుల పెంపకం ఏర్పాటు చేసుకొనుటకు ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, జనరల్ అభ్యర్థులకు రాయితీలు కలుస్తుందని మెదక్ ఉద్యానవన శాఖ ఏఎస్ఓ బండారు లింగం సోమవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టు పురుగుల పెంపకం షెడ్డుకు ప్రభుత్వం రూ.4.5లక్షలు అందింజేస్తుందని,అందులో రూ.2లక్షల 92వేల 500/- సబ్సిడీ ఇస్తుందని, రెండు ఎకరాల మల్బరీ తోట పెంచుటకు రూ.1లక్ష 20వేలు అందజేస్తుందని, అందులో రూ.78వేలు సబ్సిడీ ఉంటుం దన్నారు.బిందు సేద్యం(డ్రిప్ ఇరిగేషన్)రూ.1లక్ష అందిస్తుందని,అందులో రూ.65వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్ప్రింక్లరుకు రూ.80వేలు కాగా, అందులో రూ.52వేలు సబ్సిడీ ఉంటుందన్నారు.రన్ గన్ కు రూ.80వేలు కాగా,52 వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. జనరల్ అభ్యర్థులకు పట్టు పురుగుల పరిశ్రమ ఏర్పాటుకు రూ.4.5 లక్షలు అందజేస్తుందని, రూ.2.25 లక్షల సబ్సిడీ ఉంటుందన్నారు. మల్బరీ తోట పెంచుటకు రూ.1లక్ష 20వేలు అందజేయగా రూ.60వేల సబ్సిడీ ఉంటుందన్నారు. బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ఏర్పాటుకు రూ.1లక్ష ఇవ్వగా రూ.50వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. స్ప్లింకర్ కు రూ.80వేలు ఇవ్వగా,రూ.40వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. రన్ గన్ కు రూ.80వేలు కాగా 40వేలు సబ్సిడీ ఉంటుందని ఆయన వెల్లడించారు. కిలో పట్టు పురుగుల రేటు జనగామ మార్కెట్ లో రూ.700/- నుండి 800/- వరకు పలుకుతుందని ఆసక్తి గల రైతులు తమ తమ వ్యవసాయ భూముల్లో పట్టు పరిశ్రమ ద్వారా యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. మరిన్ని వివరాలకు ఏఎస్ ఓ లింగం సెల్ నెంబరు 9676594011ను సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


