ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం

 ఎస్సీ స్టడీ సర్కిల్ భవనంపై నుంచి దూకి మంచిర్యాల విద్యార్థి ఆత్మహత్య.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సి స్టడీ సర్కిల్లో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఫౌండేషన్ కోర్సు శిక్షణ తీసుకుంటున్న మంచిర్యాల జిల్లా కు చెందిన విద్యార్థి భవనం మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు స్నేహితులతో టిఫిన్ కి వెళ్తానని చెప్పిన కాసేపటికి ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో అక్కడి విద్యార్థులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామం గా పోలీస్ లు, స్టడీ సర్కిల్ సిబ్బంది గుర్తించారు.గత నాలుగు నెలలుగా ఆదిలాబాద్ లోనే ఉంటూ శిక్షణ తీసుకుంటున్న స్వామిరామం  ఉదయం స్నేహితులతో టిఫిన్ చేద్దామని పిలవగా.. వస్తానని చెప్పి భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాల పాలైన అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు వ్యక్తిగత కుటుంబ సమస్యల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని, ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంకా మృతికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గాజులపల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ గాజులపల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
దౌల్తాబాద్‌, సిద్దిపేట:  మండలంలోని గాజులపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థికసాయాన్ని సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను...
ఉపసర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తే మరో ఉద్యమమే
పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం