మాజీ ఎంపీపీ నల్ల రాజన్న పాత్రికేయులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి

మాజీ ఎంపీపీ నల్ల రాజన్న పాత్రికేయులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి

బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ 

జగిత్యాల జిల్లా మల్లాపూర్ : పాత్రికేయులను అసభ్య పదజాలంతో దూషించిన మాజీ ఎంపీపీ నల్ల రాజన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.. ప్రజల సమస్యలను నిరంతరం ప్రచురించేందుకు పాత్రికేయులు ముందు ఉంటారని అన్నారు. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. అలాంటి పాత్రికేయులను అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ నల్ల రాజన్న అసభ్యపరంగా దూషించడం బాధాకరమని అన్నారు. పది సంవత్సరాలు బి ఆర్ ఎఫ్ పార్టీ అధికారంలో ఉన్న ఎప్పుడు పాత్రికేయులపై విమర్శించలేదని అన్నారు. కావున మాజీ ఎంపీపీ నల్ల రాజన్న బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకు పాత్రికేయులకు అండగా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఇక్కడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మాజి జెడ్పిటిసి సందీ రెడ్డి శ్రీనివాస్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసయ్య, మాజీ వైస్ చైర్మన్ శరత్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి లింగస్వామి గౌడ్, తదితరులున్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం