జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా అబ్బ కరుణాకర్ ముదిరాజ్ ఎన్నిక

 శుభాకాంక్షలు  తెలిపిన జర్నలిస్టు మిత్రులు

  జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా అబ్బ కరుణాకర్ ముదిరాజ్ ఎన్నిక

నాగర్ కర్నూల్ ,బిజినాపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీఅధ్యక్షులుగా అబ్బ కరుణాకర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని, అదే సమయంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడా ల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీజేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా అబ్బ కరుణాకర్ ముదిరాజ్ గారి నాయకత్వంలో జర్నలిస్టుల ఐక్యత మరింత బలోపేతం కావాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం అబ్బ కరుణాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ... జర్నలిస్టు సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తానని, తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిన రాష్ట్ర అధ్యక్షులు కర్ణాకర్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి కృతజ్ఞతలు  తెలిపారు. ప్రతినిత్యం జర్నలిస్టు సమస్యలపై పోరాడుతూ, జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను సాధించే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని తెలిపారు.

Views: 86

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం