రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల కు ఎంపికైన తాడ్కోల్ యువకుడు.
అభినందించిన స్పార్క్ మైండ్ పాఠశాల యజమాన్యం..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామాని కి చెందిన శివ అనే యువకుడు కామారెడ్డి జిల్లా కేంద్రం లోని ఇందిరా గాంధీ స్టేడియం లో రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీల ను నిర్వహించ గా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామాని కి చెందిన శివ 100 మీటర్ల పరుగు పందెం లో ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం శివ స్పార్క్ మైండ్ పాఠశాలలో పి ఈ టి టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు కాగా ఆదివారం పాఠశాల యాజమాన్యం సిబ్బంది శివ ను సన్మానించి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ పాశం రాజిరెడ్డి కరస్పాండెంట్ కిరణ్ డైరెక్టర్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


