రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ అధ్యక్షురాలిగా పారిజాత నరసింహారెడ్డి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభియాన్ జిల్లా అధ్యక్షురాలిగా ఇటీవల నియమి తులైన పారిజాత నరసింహారెడ్డి సోమవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.తనను రంగారెడ్డి జిల్లా సంఘటన్ సృజన్ అభియాన్ అధ్యక్షు రాలిగా నియమించిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచే యాలని మంత్రి సూచించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.రంగారెడ్డి జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వారి కోసం పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.మంత్రి సూచనల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని పారిజాత నరసింహారెడ్డి తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


