గాజులపల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

గాజులపల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

దౌల్తాబాద్‌, సిద్దిపేట:  మండలంలోని గాజులపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థికసాయాన్ని సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను గ్రామ సర్పంచ్‌ పంజ స్వామి లబ్ధిదారులకు అందించారు. గ్రామానికి చెందిన మారుపాక కల్పనకు రూ.16,500, పంచ సత్యనారాయణకు రూ.20,500 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థికసాయం అందడం కొంత ఊరటనిస్తుందని సర్పంచ్‌ పంజ స్వామి పేర్కొన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ సహాయ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశం యేసు, తోట నరేష్, దాసరి బిక్షపతి, పోతిగంటి మల్లారెడ్డి, పోతుగంటి శ్రీనివాస్, పాండర్‌రెడ్డి, దాసరి నాగయ్య, పాశం గంగయ్య, మాదారు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అంత డొల్ల కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అంత డొల్ల
మందమర్రి, (మంచిర్యాల) : అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అంత డొల్ల నేనని,ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ...
సన్న రకం వరి పండించే రైతులు విత్తన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి: ఏఈఓ రామకృష్ణ 
ప్రజావాణి కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ నిరసన
డ్రైనేజీ కూల్చేశారు...
గాజులపల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
ఉపసర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తే మరో ఉద్యమమే
పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్