చిన్నారుల భక్తిశ్రద్ధలు అభినందనీయం
బాలగణపతి ఉత్సవాల్లో గుంటుకు రాజు ముదిరాజ్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో 'గరుడ యూత్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలగణపతిని బీఆర్ఎస్ నాయకులు గుంటుకు రాజు ముదిరాజ్ దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులంతా ఏకమై భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థి దశ నుంచే దైవభక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ఉత్తమ విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. భావి భారత పౌరులుగా సమాజానికి ఆదర్శంగా ఎదగాలని చిన్నారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గరుడ యూత్ సభ్యులు రామ్ చరణ్ చారి, సాయి చరణ్ చారి, రిషిత్ రెడ్డి, హరివర్షిత్ రెడ్డి, అశ్వంత్, శ్రీనిత్, నాగాచరణ్, అరవింద్, సిద్ధార్థ్ చారి, అభినందన్, రోహిత్ చంద్ర, శివ సాయి, సుచిత్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


