బోథ్‌లో ఘనంగా ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ ఘన నివాళులు
ఆదిలాబాద్ డెస్క్ (బోథ్): బోథ్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ వర్థంటి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ఘన నివాళులు అర్పించారు బస్టాండ్ కేంద్రం లో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి, చేనేత కార్మికుల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 1969 తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన గొప్ప దేశభక్తుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పడిన తపన భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు మెరుగు భోజన్న,ప్రధాన కార్యదర్శి మాసం అనిల్ కుమార్ ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం చంద్ర మోహన్,కోశాధికారి కటకం నగేష్ , వడ్లకొండ సురేందర్,గుండు మల్లేష్,కొమారి దయాకర్,కొండ స్వామి ,వార్డ్ సభ్యులు సాయి కట్కూరి,ఆడెపు కిరణ్,కటకం ప్రసాద్,కదెరుగుల గోవర్ధన్,వడ్లకొండ శ్రీనివాస్,ఉసికెల శేఖర్ ,బిట్లింగ్ సంతోష్ పద్మశాలి సంఘ పెద్దలు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


