శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోమలపెంట సమీప అటవీ ప్రాంతం, ఆక్టోపస్ సమీపంలో సోమవారం ఉదయం కారు-బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


