స్పీకర్‌పై వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలి.. దుర్గం భాస్కర్
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ను దూషించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని అన్నారు.తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అలాగే ఎమ్మెల్సీ పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని శాసనమండలి ఛైర్మన్‌ను డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక బీఆర్‌ఎస్ అగ్రనేతల ప్రోత్సాహం ఉందని ఆరోపించిన భాస్కర్, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


