ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత
(మంచిర్యాల) మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం పురస్కరించుకొని సోమవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యుటీ మేయర్ సల్ల రమ్య మహేష్ 54 వ డివిజన్ లో ప్రజల సౌకర్యార్థం 10 బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డిప్యుటీ మేయర్ సల్ల రమ్య మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే పుట్టినరోజు పురస్కరించుకొని ప్రజల సౌకర్యార్థం ఉచిత సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుం దన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం ఉచిత టెంట్ హౌస్,గత సంవత్సరం ఉచిత మినరల్ వాటర్ తో పాటు సుమారు 2 వందల వాటర్ క్యాన్ లను అందజేశామని, ఈ ఏడాది డివిజన్ లోని ప్రజల సౌకర్యార్థం వార్డులో 10 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గం లో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు.ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని గోపాల్ వాడ లో ఏర్పాటు చేసిన గణపయ్య వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.ఈ కార్యక్రమం లో నాయకులు దొడ్డి కిట్టు, గుంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


