టేబుల్ టెన్నిస్ పోటీల్లో టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం  మొదటి స్థానం

టేబుల్ టెన్నిస్ పోటీల్లో టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం  మొదటి స్థానం

హన్మకొండ న్యూస్ :  టీజీఎన్‌పీడీసీఎల్‌లో క్రీడలకు అత్యంత  ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నామని సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు.  ఉద్యోగులలో పని ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్స్, ఆఫీసర్స్ క్లబ్‌లో  తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ టేబుల్ టెన్నిస్ పోటీలు  నిర్వహించారు. ఈ క్రీడా  పోటీల్లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో కార్పొరేట్ కార్యాలయ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విజేతలు చీఫ్ జనరల్ మేనేజర్ వి. వేణుబాబు, చీఫ్ ఇంజనీర్ ఏ. సురేందర్, జి.గణేష్ సోమవారం హన్మకొండ నక్కలగుట్ట  టీజీఎన్‌పీడీసీఎల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో  డైరెక్టర్ల సమక్షంలో  సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి ని  మర్యాదపూర్వకంగా కలిసి, ట్రోఫీని సీఎండీకి అందజేశారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఇటీవల టీజీఎన్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో క్రీడా  పోటీలు నిర్వహించామని,  క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి క్రీడల్లో పాల్గొనేలా అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నామని సీఎండీ వివరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల విజేతలు చీఫ్ జనరల్ మేనేజర్  వి. వేణుబాబు,  చీఫ్ ఇంజనీర్ ఏ. సురేందర్, జి.గణేష్ ని  సీఎండీ అభినందించారు.  సంస్థ ఉద్యోగులు క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.  ఓపెన్ డబుల్స్ విభాగంలో వి. వేణుబాబు, ఏ. సురేందర్ ప్రథమ స్థానం సాధించగా, ఓపెన్ సింగిల్స్ విభాగంలో కూడా వి. వేణుబాబు  తృతీయ స్థానం సాధించారు.9 జట్లు టీం ఈవెంట్ లో, డబుల్స్ లో  16 టీం లు తలపడగా కార్పొరేట్ కార్యాలయం రెండింటిలో  మొదటి స్థానంలో నిలించింది. స్పోర్ట్స్ కౌన్సిల్ ఓఎంసీ టీజీ ట్రాన్స్కో నిజామాబాదు ఆధ్వర్యంలో ఈ ఇంటర్  సర్కిల్ టేబుల్ టెన్నిస్ పోటీలు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు , వి. తిరుపతి రెడ్డి, సి. ప్రభాకర్ , జియం యం .హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం