ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి... పద్మశాలి సంఘం 

ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి... పద్మశాలి సంఘం 

ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ లో నూతనంగా ఏర్పాటు అయ్యే జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్ కు ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నామకరణం చేయాలని  తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేత రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతిని పురస్కరించుకొని బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళుల ర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అదిలాబాద్ ఎయిర్పోర్టుకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని, ఈనెల 27న బాపూజీ జయంతి సందర్భంగా  ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు జక్కుల సత్యనారాయణ, ఆశమ్మ, అనుముల ఉష న్న, కుర్ర రవీందర్,  అడెల్లు తదితరులు పాల్గొన్నారు. 

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget