నాంపల్లిలో డిగ్రీ కళాశాల, మున్సిప్ కోర్టు ఏర్పాటు చేయాలి.
ప్రజావాణిలో అధికారులకు వినతి
నాంపల్లి: పాత తాలూకా కేంద్రమైన నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు మున్సిప్ కోర్టును కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం
ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు.500 మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు మండల కేంద్రంలో విద్యనభ్యసిస్తున్నారు. నాంపల్లి ప్రాంతం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోరారు. అలాగే స్థానికంగా మున్సిప్ కోర్టుకు సంబంధిత వివాదాలు, చిన్నపాటి కేసుల పరిష్కారానికి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాంపల్లిలో కోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ రెండు అంశాలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు గిరి స్వామి, వార్డు సభ్యులు కోరే శేఖర్, అడ్వకేట్ కోరే కిషన్, రఘు, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


