గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.
- రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి.. లేనిపక్షంలో ఆందోళనలు
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు
అక్కన్నపేట,: అక్కన్నపేట మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ విజయానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలోని ప్రతి బూత్ పరిధిలో ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా భావిస్తున్న గౌరవెల్లి–గండిపల్లి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతున్నా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాధనం వినియోగించిన ప్రాజెక్టును ఇకనైనా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు చేపట్టి రైతులకు త్వరగా నీరు అందించాలని కోరారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పి, క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, సమస్యలు పరిష్కరించకపోతే విద్యుత్ కార్యాలయాల ముట్టడి చేపడతామని తెలిపారు. రైతుల సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అక్కన్నపేట మండలంలో పూర్తిస్థాయి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టకపోవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీరును ఆయన ప్రశ్నించారు. మండలానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలనా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.సమావేశంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, అక్కన్నపేట మండల ప్రభారి మాచర్ల కుమారస్వామి గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రజనీకర్ రెడ్డి, జిల్లా కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ వేణుగోపాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు మెడవేనా స్వరూప, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కర్ణకంటి నరేష్, మాజీ మండల అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి వీరాచారి, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్ ముదిరాజ్, మడక రవికుమార్, మండల ఉపాధ్యక్షులు అర్జున్ నాయక్, బోనగిరి తిరుపతి, మండల కార్యదర్శులు రైనా నాయక్, పంగ శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్ విష్ణు, సామ్ రెడ్డి, జంగాపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మోర్చాల మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


