సారంగాపూర్ మండల కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం
సారంగాపూర్ : మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ప్రకటించిన సందర్భంగా, పార్టీ మండల అధ్యక్షులు కొత్తపల్లి మాధవరావు నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి గ్రామంలోనూ మండల ముఖ్య నాయకులతో కలిసి గ్రామ కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అందరూ అంకితభావంతో, విధేయతతో, పార్టీపై నమ్మకంతో ముందుకు సాగాలని, పార్టీ పెద్దలు మరియు సీనియర్ నాయకుల సలహా సూచనలతో నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


