శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు

శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు

  •  - 8 రోజుల్లో 19.51 టీఎంసీలు క్షీణత 
  • - సాగునీటి వర్గాల్లో ఆందోళన
  • - కనీస డ్రాడౌన్ లెవల్ కు చేరువలో నీటిమట్టం

నాగర్ కర్నూల్ : శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గత 8 రోజుల్లో ఏకంగా 19.51 టీఎంసీల మేర నీటి నిల్వ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ 13న 119.49 టీఎంసీలుగా ఉన్న నిల్వలు, సెప్టెంబర్ 21 నాటికి 99.98 టీఎంసీలకు పడిపోయాయి. అంటే రోజుకు సగటున 2.44 టీఎంసీల చొప్పున నికర నీటి వినియోగం జరుగుతోంది. నీటిమట్టం కూడా 864.20 అడుగుల నుంచి 858 అడుగులకు పడిపోయింది. సాగునీటి కనీస డ్రాడౌన్ లెవల్ (MDDL) 854 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం దానికి కేవలం 4 అడుగుల ఎగువన మాత్రమే ఉంది.నీటి నిల్వలు ఇదే వేగంతో తగ్గుతుంటే త్వరలోనే MDDL కంటే దిగువకు వెళ్లే ప్రమాదం ఉందని సాగునీటి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీశైలం నీటి వినియోగం, మిగిలిన నిల్వలపై సర్వత్రా ఆసక్తి నెలకొందీ

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం