డ్రైనేజీ మధ్యలో విద్యుత్ స్తంభాలు

ప్రమాదానికి ఆహ్వానం

డ్రైనేజీ మధ్యలో విద్యుత్ స్తంభాలు

  • అధికారుల నిర్లక్ష్యం.. స్పందించని ఏఈ
  • కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం.. అస్తవ్యస్తంగా పనులు
  • గాలివానకు రోడ్డువైపు వంగిన విద్యుత్ స్తంభం

కొత్తగూడెం బ్యూరో : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరం 15వ డివిజన్‌లో డ్రైనేజీ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే పనులు చేపడుతుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఉండటంతో వాహనదారులు, పాదచారులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
గాలివానకు రోడ్డువైపు వంగిన స్తంభం
రామవరం ప్రధాన రహదారిలో డ్రైనేజీ నిర్మాణ ప్రాంతంలో ఉన్న ఓ విద్యుత్ స్తంభం శనివారం రాత్రి వీచిన గాలులు, కురిసిన వర్షానికి రోడ్డువైపు వంగిపోయింది. విద్యుత్ సరఫరా కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. వంగిపోయిన విద్యుత్ స్తంభం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదా?
డ్రైనేజీ నిర్మాణం మధ్యలో విద్యుత్ స్తంభాలు ఉండటంపై గతంలోనే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూస్తారా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఏఈ స్పందించడం లేదన్న కార్పొరేటర్
ఈ విషయంపై 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియను వివరణ కోరగా.. విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించాలని తాము అనేకసార్లు అధికారులకు తెలిపినప్పటికీ సంబంధిత ఏఈ స్పందించడం లేదని తెలిపారు. ఫోన్ చేసినా ఏఈ ఫోన్‌ లిఫ్ట్ చేయడం లేదని ఆమె పేర్కొన్నారు.
ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా?
ప్రజల రాకపోకలకు కీలకమైన ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వంగిపోయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా ముందుగానే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను సంబంధిత శాఖల సమన్వయంతో సురక్షితంగా తొలగించి, అనంతరం డ్రైనేజీ పనులను నిబంధనల ప్రకారం కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే పనులపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం