నాగర్ కర్నూల్ జిల్లా సర్కార్ దవాఖానలో సౌకర్యాల లేమి - కలెక్టర్ కు ఫిర్యాదు

నాగర్ కర్నూల్ జిల్లా సర్కార్ దవాఖానలో సౌకర్యాల లేమి - కలెక్టర్ కు ఫిర్యాదు

ఎంఆర్ఐ స్కానింగ్, అంబులెన్స్ సౌకర్యం కరువు - తాగునీటికి కూడా ఇబ్బందులు

నాగర్ కర్నూల్,: నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.జిల్లా ఆసుపత్రిలో ఎం.ఆర్.ఐ స్కానింగ్ సౌకర్యం అందుబాటులో లేదని, నుల్లో గడ్డలకు సంబంధించిన వైద్యం, అంబులెన్స్ సౌకర్యం కూడా సరిగా అందడం లేదని వాపోయారు. దూర ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, కూలీలకు కనీస వసతులు లేవని, తాగడానికి మంచినీరు కూడా అందరికీ అందుబాటులో లేదని లేఖలో పేర్కొన్నారు.ప్రజలకు అందాల్సిన ఉచిత వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కాపీని ఆసుపత్రి సూపరింటెండెంట్, డీఎం & హెచ్ఓ నాగర్ కర్నూల్ గారికి పంపినట్లు తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో పి.శంకర్, పి.రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Views: 56

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం