చలో భద్రాచలం.. ఆదివాసీ మార్చ్ ఐటీడీఏ ముట్టడికి ఆదిలాబాద్ తుడుందెబ్బ జిల్లా కమిటీ
ఉట్నూర్ : చలో భద్రాచలం కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ ముట్టడికి ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ కమిటీ బయలుదేరింది. జిల్లా అధ్యక్షులు పెందోర్ దాదారావు, ప్రధాన కార్యదర్శి పుర్క చిత్రు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భద్రాచలానికి పయనమయ్యారు.జీవో న.3 ను పునరుద్ధరించాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది. 29 శాఖలకు సంబంధించిన జీవోలను ఏకీకృతం చేసి చట్టబద్ధత కల్పించాలని కోరింది. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఐటీడీఏల ద్వారానే సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది.“మా నీళ్లు.. మా నిధులు.. మా నియామకాలు.. మా వనరులు.. మా అడవి మాకే దక్కాలి” అని తుడుందెబ్బ స్పష్టం చేసింది. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో జోనల్ వ్యవస్థను రద్దు చేసి, వలసలను నిరోధించాలని కోరింది.జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కొమురం భీమ్ స్ఫూర్తితో “మావ నాటే.. మావ సర్కార్.. స్వయంపాలన” డిమాండ్‌తో 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని గొండ్వానా రాష్ట్రంగా ప్రకటించాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది.5వ షెడ్యూల్ ప్రాంతాల నుంచి నీళ్లు, సహజ వనరుల దోపిడీని అడ్డుకోవాలని కోరుతూ, తమ డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తుడుందెబ్బ నాయకులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


