కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ మంత్రి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ దూదేకుల బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ JAC వైస్ చైర్మన్ మహమ్మద్ రాజమ్మద్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మహమ్మద్ రాజమ్మద్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నిఖార్సైన ప్రజా నాయకుడని అన్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధిగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బాపూజీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటాలు నేటి తరానికి, భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలు, ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మహమ్మద్ రాజమ్మద్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ, ఆయన చూపిన సామాజిక న్యాయం, ప్రజాసేవ, ఉద్యమ స్ఫూర్తి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా మహమ్మద్ రాజమ్మద్ పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


