బాలగణపతిని దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకుడు ఎన్.సి. సంతోష్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో 'గరుడ యూత్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలగణపతిని బిఆర్ఎస్ నాయకుడు ఎన్.సి. సంతోష్ దర్శించుకున్నారు. అక్కడ ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని, గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులంతా కలసి ఎంతో భక్తిశ్రద్ధలతో బాలగణపతిని ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలు దైవభక్తితో పాటు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తమ విద్య ద్వారానే జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని చిన్నారులకు సూచించారు. సమాజానికి ఆదర్శంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గరుడ యూత్ సభ్యులు రామ్ చరణ్ చారి, సాయి చరణ్ చారి, రిషిత్ రెడ్డి, హరివర్షిత్ రెడ్డి, అశ్వంత్, శ్రీనిత్, నాగాచరణ్, అరవింద్, సిద్ధార్థ్ చారి, అభినందన్, రోహిత్ చంద్ర, శివ సాయి, సుచిత్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


