శివంపేటలో ప్రజావాణి నిర్వహణ
అధికారుల సమక్షంలో ప్రజల సమస్యలపై వినతుల స్వీకరణ
శివంపేట(మెదక్): శివంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
కార్యక్రమానికి మండల విద్యాధికారి, ఇందిరమ్మ ఇళ్ల అధికారి, పంచాయతీరాజ్ ఏఈ, తహసీల్దార్, ఈజీఎస్ అధికారి, విద్యుత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు స్వీకరించి, ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


