సుoకెట్ టీచర్ కు రాష్ట్ర స్థాయి అవార్డు 

సుoకెట్ టీచర్ కు రాష్ట్ర స్థాయి అవార్డు 

బాల్కొండ (నిజామాబాదు) :- నిజామాబాదు జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలోని  సుoకెట్ గ్రామానికి చెందిన గట్టు దేవిదాస్ విద్యారంగంలో వినూత్న బోధనా పద్ధతులు, అంకితభావం మరియు సేవలకు గుర్తింపుగా ఐ. టి. ఏ.–2026,ఇన్నోవేటివ్ టీచర్స్ రాష్ట్ర స్థాయి అవార్డలను జతేంద్ర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అకాడమీ హైదరాబాద్ వారిచే  ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఏం. ఎల్. సిపింగిలి శ్రీపాల్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం విశేషం.గట్టు దేవిదాస్ స్వగ్రామం సుoకెట్ (మోర్తాడ్ మండలం )ప్రధాన మంత్రి శ్రీ జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల కోనసముందర్ లో  1984 -85 నుండి 2017 వరకు  విద్యార్థులకు "ఫిసికల్ సైన్స్" లో వినూత్న పద్దతిలో భోదించడం వల్ల ఈ అవార్డు రావడం జరిగింది.

అవార్డు పట్ల హర్షం - రాష్ట్ర నాయకులు 

1984-85 నుండి 2017-18 వరకు  గ్రామీణ ప్రాంతాల నుండి సంక్షేమ గురుకులాల్లో చదివిన ఎందరో మంది విద్యార్థులు నా శిష్యులుగా  శిక్షణ పొంది నేడు రెవెన్యూ, పోలీస్, ఆర్మీ, నేవీ, ఫారెస్ట్, ఇంజనీర్లుగా పాటు తెలంగాణ సెక్రటరేట్ లో సెక్షన్ ఆఫీసర్ గ పనిచేస్తున్నారని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు సెక్రటరీ 
రిటైర్డ్ ఎన్.సి సి (ఆర్మీ) ప్రథమ అధికారి బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు హర్షం వ్యక్తం చేసారు.ఇది ఇలా ఉండగా ముఖ్యంగా డా,, అజ్మీరా ప్రకాష్, సీనియర్ కార్డియాలజిస్ట్ గ కాకుండా ఎందరో డాక్టర్లు గ పనిచేస్తున్నారని నా శిష్యులు
అందరు నన్ను గుర్తించు కుంటున్నారని అయన వివరించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget