సాయి విద్యానగర్ కాలనీలో ఘనంగా గణనాథునికి కుంకుమార్చన
సిద్దిపేట జిల్లా : సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని సాయి విద్యానగర్ కాలనీ గణేష్ మండపం వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీలోని మహిళలంతా ఏకమై విఘ్నేశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ లంబోదరుని కరుణాకటాక్షాలతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని గణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారికి మంగళహారతులు పట్టి, నైవేద్యంగా రకరకాల పిండివంటలు, తీపి పదార్థాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి ఐశ్వర్య, పిట్ల సరోజన, శ్రీవాణి, భారతి, రమ్య, కళ్యాణి, అర్చిత, ఉష, జ్యోతి, శైలజ, కాలనీ మహిళలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


