మక్తల్ మండల నూతన ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) ఏకగ్రీవ ఎన్నిక
- అధ్యక్షుడిగా మామిళ్ల పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి గా రాజు పెయింటర్ ...
- అభినందించిన సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగురు సురేందర్, బాల్ రాజ్ ...
నారాయణ పేట జిల్లా,:మక్తల్ మండలం,మక్తల్ మండల నూతన ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) కమిటీని ఆదివారం సీనియర్ జర్నలిస్టులు, సలహాదారులు అంజన్ ప్రసాద్ (దిశ), దేవసూగూరు సురేందర్ ( ఆంధ్ర జ్యోతి), మద్వార్ బాల్ రాజ్ (సాక్షి ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) అధ్యక్షులుగా మామిళ్ళ పృథ్విరాజ్ (సత్యవార్త పత్రిక),ప్రధాన కార్యదర్శిగా రాజు పెయింటర్ (తెలుగు ప్రభ), గౌరవ అధ్యక్షులుగా ఎల్లారెడ్డి(వెలుగు)ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేష్ గౌడ్(మన తెలంగాణ), రఘు (వార్త) కోశాధికారిగా గోవింద్ (సూర్య), కార్యదర్శులుగా ప్రదీప్ (జనం సాక్షి), సి. సురేష్( ప్రజా పక్షం), కర్నె బాల్ రాజ్ (నవ తెలంగాణ), హరిక్రిష్ణ (విజన్ ఆంధ్ర) ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా నూర్ పాషా(నినాదం) కార్తీక్ (ప్రజాదర్బార్), వెంకట్ రెడ్డి (ప్రజా లక్ష్యం)లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన ఐక్యత కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా వక్తలు ఆకాంక్షించారు. ఎన్నికైన అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


