హైదరాబాద్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి..

హైదరాబాద్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి..

చేనేత సహకార సంఘం డైరెక్టర్ యలగందుల సాయినేత.

సూర్యాపేట : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పోషించిన కీలక పాత్ర, సామాజిక ఉద్యమాల నిర్మాణంలో చేసిన కృషి, స్వాతంత్ర్యోద్యమంలో ఆయన అనుభవాలు, ప్రజాసేవను భవిష్యత్ తరాలకు అందించేలా హైదరాబాద్‌లో ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చేనేత సహకార సంఘం డైరెక్టర్ యలగందుల సాయినేత కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 97 ఏళ్ల వయసులోనూ ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆకలితో నిలబడి దీక్ష చేసిన అలుపెరగని పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన ఆయన త్యాగాలు, సేవలు, ఉద్యమ స్ఫూర్తిని నేటి యువతకు, భావితరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

బాపూజీ నివాసమున్న జలదృశ్యం మార్గానికి కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గ్ గా నామకరణం చేయాలని, తెలంగాణలోని ఏదైనా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బాపూజీ జీవిత చరిత్రను రాష్ట్ర పాఠ్యపుస్తకాలలో చేర్చి, ఆయన ఉద్యమ ప్రస్థానం గురించి విద్యార్థులకు తెలియజేయాలని అన్నారు.జాతీయస్థాయిలో ఆయన సేవలను స్మరించుకునేలా కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డు ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం సామాజిక సేవ, ప్రజా ఉద్యమాలు, చేనేత రంగం, తెలంగాణ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందించాలని సూచించారు.అదేవిధంగా, కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలకు జాతీయస్థాయిలో తగిన గుర్తింపు కల్పించే దిశగా పద్మశ్రీ వంటి జాతీయ పురస్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సాధారణ నిబంధనల ప్రకారం మరణానంతరం పద్మ పురస్కారాల విషయంలో ఉన్న పరిమితులను పరిగణనలోకి తీసుకుంటూనే, బాపూజీ విశిష్ట సేవలను గుర్తించి ప్రత్యేకంగా పరిశీలించే మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిపేలా ఆయన పేరుతో స్మారక కేంద్రం, జాతీయ అవార్డు, జిల్లాకు నామకరణం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలని కోరారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా...
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 
ఘనంగా పోషణ అభియాన్ మాసం
ఎమ్మెల్యే పిఎస్ఆర్ జన్మదినం సందర్బంగా బెంచీలు అందజేత 
  దౌల్తాబాద్ గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 
గణపతి నిమజ్జన రూట్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
ఉత్లూర్ లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం