14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు చేసిన బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులు ఎంతో వైవిధ్యభరితంగా బాలగణపతి ప్రతిమను ప్రతిష్ఠించి, తమ చిట్టి చేతులతో ప్రతిరోజూ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలనీవాసులను ఆకట్టుకోవడంతో పాటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజూ స్వామివారికి విశేష అర్చనలు, హారతులు సమర్పించి, దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక సంస్కృతిని, ఐక్యమత్యాన్ని చాటుతున్న చిన్నారులను స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో గరుడ యూత్ అసోసియేషన్ సభ్యులు రామ్ చరణ్ చారి, సాయి చరణ్ చారి, రిషిత్ రెడ్డి, హరివర్షిత్ రెడ్డి, అశ్వంత్, శ్రీనిత్, నాగాచరణ్, అరవింద్, సిద్ధార్థ్ చారి, అభినందన్ చారి, రోహిత్ చంద్ర, శివసాయి చారి, సుచిత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


