ఘనంగా వయోవృద్ధులకు ఆయుర్వేద వైద్యపరీక్షలు

ఘనంగా వయోవృద్ధులకు ఆయుర్వేద వైద్యపరీక్షలు

జిల్లా కేంద్రంలో నీ ప్రథమ్ సెంటర్ లో ఏర్పాటు 

ఆదిలాబాద్  :  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం 11 వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలోని మూడు రోజుల షెడ్యూల్ లో భాగంగా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ - ప్రథమ్ సెంటర్ లో (జీరియాట్రిక్) వయో వృద్దులకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వయోవృద్దులు అధిక సంఖ్యలో పాల్గొని కాల్ల నొప్పులు,కీళ్ల నొప్పులు,దగ్గు జలుబు,శ్వాసకోశ సంబందిత వ్యాధులు,ఆమ్ల పిత్తము, మలబద్దకము, ఆర్ష మొలలు,జీర్ణ వ్యవస్తకు సంబందించిన వ్యాధులు,మధుమెహం,అధిక రక్త పోటు నిద్రలేమి సమస్యలు,నరాలు,కండరాల బలహీనత,అన్ని రకాల దీర్ఘ కాల వ్యాధులకు సంబందించిన పేషెంట్ల ను పరిక్షించి ఉచితంగా ఆయుర్వేద ఔషదాల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్ర మంలో ఆయూ ర్వేద నోడల్  ఆఫీసర్ డా.కస్తాల చంద్రశేఖర్,డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ (డి.పి.యం) డా.ప్రతల్ రాథోడ్,సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ డా.దేవిదాస్ దేశ్ పాండే,జనరల్ సెక్రెటరి కులకర్షి,ఆయూర్వేద డాక్టర్ ఇక్ర మొద్ధిక్,డా.కాంత్ పస్లావార్,ఇన్స్ట్రక్టర్ విశాల్,పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget