టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్‌ను సన్మానించిన గొంగ్లూర్ గ్రామస్తులు
చౌటకూర్,: ప్రయాణికుల భద్రతకు ఇబ్బందిగా మారిన స్పీడ్ బ్రేకర్లను తొలగించి సమస్యను పరిష్కరించిన టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరిని గొంగ్లూర్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. చౌటకూర్ మండలం తాడ్దాన్పల్లి చౌరస్తా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో ద్విచక్ర వాహనాలు వెళ్లే సింగిల్ రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, వాటిని తొలగించాలని టోల్ ప్లాజా ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరి దృష్టికి తీసుకెళ్లారు.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తిపై ప్రాజెక్ట్ మేనేజర్ సుజిత్ కుమార్ చౌదరి వెంటనే స్పందించారు. సంబంధిత సిబ్బందితో మాట్లాడి సింగిల్ రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను తొలగించారు.తమ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించినందుకు కృతజ్ఞతగా పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామస్తులు సుజిత్ కుమార్ చౌదరిని ఘనంగా సన్మానించారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పల్లె కిష్టయ్య, పుట్టి కిష్టయ్య, ఆలూరి బ్రహ్మానందరెడ్డి, పల్లె చంద్ర కిరణ్, బేగరి సామెల్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


