ఆగస్టు 10 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి : కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పీఎం కుసుమ్ పథకం కింద నిర్మించిన 1 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నుంచి ఆగస్టు 10 నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్‌ను సందర్శించిన కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, సాంకేతిక ప్రక్రియలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో సోలార్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, సంబంధిత శాఖలు సమన్వ యంతో పనిచేసి నిర్ణీత గడువులో ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతను కాపాడుతూ మిగిలిన అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, పీఏసీఎస్ చైర్మన్ రాంచందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ సీఈవో కోలేటి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
