పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్

 పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్

కొత్తగూడెం బ్యూరో   : సెయింట్ మేరీస్ స్కూల్‌లో నిర్వహించిన పేరెంట్–టీచర్ మీట్ (PTM) వినూత్నంగా, ఆకట్టుకునేలా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కొత్త ప్రణాళికకు శ్రీకారం చుడుతూ, విద్యార్థుల మార్కుల వివరాలను తల్లిదండ్రులకు అందించడంతో పాటు వారు స్వయంగా రూపొందించిన వివిధ రకాల నమూనాలు, ప్రాజెక్టులు, సృజనాత్మక వస్తువులతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంది.  ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా బయాలజీ అంశంపై సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు తమ శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకతను ప్రతిబింబించే వివిధ నమూనాలను ప్రదర్శించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకున్నారు.ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ మేరిజాన్, ప్రధానోపాధ్యాయిని సిస్టర్ నిర్మలా పోలిశెట్టి మాట్లాడుతూ, ఇకపై ప్రతి పేరెంట్–టీచర్ మీట్ సందర్భంగా ఒక్కో సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రత్యేక సైన్స్ ఫెయిర్ లేదా ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత,పరిశోధనా దృక్పథం, శాస్త్రీయ ఆలోచన, ఆత్మవిశ్వాసం మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా పరిచయం చేసే ఈ వినూత్న కార్యక్రమాన్ని తల్లిదండ్రులు హర్షిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు పిల్లల సమగ్ర వికాసానికి ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
Views: 267

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం